డ్రామా జూనియర్స్ సీజన్ 8 కి సెలెక్ట్ ఐన గుడిసేటి ఎదవ...
on Apr 3, 2025
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగాక గుడిసేటి ఎదవలు, బడి చాటు బడితెలు బాగా పెరిగిపోయారు. ఈ గుడిసేటి ఎదవ అంటే తిట్టు అనుకునేరు ఆ పిల్లాడి ఇన్స్టాగ్రామ్ పేజీ పేరన్నమాట..ఆ పేరుతో ఒక బుడతడు గోదారి యాసతో ఆయ్ అంటూ సోషల్ మీడియాలో తెగ ఫేమస్ ఐపోయాడు. ఈ గుడిసేటి ఎదవ గోదారి జిల్లాల్లో ఎన్నో యాడ్స్ , ప్రమోషన్స్ చేస్తూ ఉంటాడు. ఇక ఈ పిల్లాడి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఐతే 77 .9 కే మంది ఉన్నారు. ఇక ఈ పిల్లాడు జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 8కి సెలెక్ట్ అయ్యాడు.
జీ తెలుగులో ఈ సీరిస్ ఇప్పటి వరకు 7 సీజన్స్ పూర్తయ్యాయి. ఐతే త్వరలో జీ తెలుగులో డ్రామా జూనియర్స్ సీజన్ 8 స్టార్ట్ అవుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో గత నెలలో హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో, సారధి స్టూడియో, అమీర్ పెట్ లోని స్టూడియోస్ లో టాలెంట్ ఉన్న 4-12 ఏళ్ల వయసున్న పిల్లల కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఈ ఆడిషన్స్ కి చాలా మంది పిల్లలు వచ్చారు. ఈ ఆడిషన్స్ కాకినాడలో కూడా జరగడంతో రాజమండ్రికి చెందిన గుడిసేటి ఎదవ అలియాస్ హరీష్ సెలెక్ట్ అయ్యాడు. ఇక ఈ పిల్లాడు ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నాడు. ఇక వాళ్ళ వాళ్ళ స్కూల్ లోని టీచర్స్, ఫ్రెండ్స్ కూడా గుడిసేటి ఎదవకి విషెస్ చెప్పారు. కొంతమంది నెటిజన్స్ ఐతే సెలెక్ట్ అయ్యావని చదువు మానేయకు చదువుకుంటూనే స్కిట్స్ చెయ్యి అంటూ సలహాలు ఇస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
